Home / CRIME / ఎమ్మెల్సీ వాణీదేవి కారుకు ప్రమాదం

ఎమ్మెల్సీ వాణీదేవి కారుకు ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారు ప్రమాదానికి గురైంది. అసెంబ్లీ గేట్‌ నంబర్‌ ఎనిమిదిని ఆమె కారు ఢీకొన్నది. ఎమ్మెల్సీని మండలి వద్ద దింపి వస్తుండగా ప్రమాదం జరిగింది.

పార్కింగ్‌ చేస్తుండగా అదుపుతప్పిన కారు రైల్వే కౌంటర్‌ సమీపంలోని గేటుపైకి దూసుకెళ్లింది. దీంతో కారుటైరు పేలిపోయింది. ప్రమాద సమయంలో కారును ఎమ్మెల్సీ గన్‌మెన్‌ నడిపినట్లు సమాచారం. అయితే భారీగా శబ్ధం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.