తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాద్ పరిధిలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది గడిచిన 24 గంటల్లో మరో 142 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన స్టేట్ హెల్త్ బులెటిన్ లో తెలిపారు.
దీంతో ఇప్పటివరకు 82,438 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సామాజిక దూరం పాటించి, మాస్క్ ధరించాలని అధికారులు తెలియజేశారు