Home / SLIDER / ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు

ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం అమలు పరుస్తున్న మిషన్‌ భగీరథ కార్యక్రమం ద్వారా శుద్ధి చేసిన స్వచ్ఛమైన నల్లా నీటిని రాష్ట్రవ్యాప్తంగా నూటికి నూరుశాతం ఇండ్లకు సరఫరా చేస్తున్నం. ప్రజలను రోగాల నుంచి కాపాడగలుగుతున్నం. ఫలితంగా ప్రజారోగ్యంలో గుణాత్మక మార్పులు వచ్చాయి. అదే సందర్భంలో తల్లీ బిడ్డల సంరక్షణే లక్ష్యంగా ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్స్‌ పథకం విజయవంతమై, మాతాశిశు సంక్షేమం మెరుగు పడింది.
-ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం బలంగా విశ్వసిస్తున్నదని చెప్పారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చేందుకు దోహదపడే పలు పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, వైద్య వ్యవస్థను బలోపేతం చేసిందన్నారు. బుధవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా తిరిగి వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, పౌష్టికాహారం తీసుకుంటూ, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలన్నారు. నిరంతరం ఆరోగ్యంపై దృష్టి నిలపడం ద్వారా తెలంగాణలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు.

జీవన ప్రమాణాలు పెంచుతున్నాం
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రభుత్వం బస్తీ దవాఖానలు నిర్వహిస్తూ సత్ఫలితాలను సాధించిందని, మిగతా పట్టణాల్లో కూడా వాటి ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి, ప్రజారోగ్య పరిరక్షణకు పాటుపడుతున్నదన్నారు. ప్రొటీన్‌తో కూడిన ఆహారాన్ని అందుబాటులోకి తెస్తూ, ప్రజల ఆరోగ్య జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం మాంసం, చేపల వినియోగాన్ని పెంచే పథకాలను అమలుచేస్తున్నదని తెలిపారు. మాంసం, చేపలు, పండ్లు, కూరగాయలు తదితర పౌష్టికాహార సరఫరాను పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా శాకాహార, మాంసాహార మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అమలుపరుస్తున్న పల్లెప్రగతి, పట్టణప్రగతి స్వచ్ఛ కార్యక్రమాలు.. పలు జాతీయ అవార్డులు పొందడం.. ప్రజారోగ్య పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సునిశితంగా పనిచేస్తున్నదనడానికి నిదర్శనమన్నారు. గతేడాది కాలంగా కరోనా కష్టకాలాన్ని తెలంగాణ తట్టుకొని నిలబడటానికి ప్రజల ఆరోగ్యకర ఆహారపు అలవాట్లే కారణమని, రోగ నిరోధక శక్తి స్థాయి పెరగడానికి ఇవి దోహదపడ్డాయని పేర్కొన్నారు.

ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నాం
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం అమలు పరుస్తున్న మిషన్‌ భగీరథ కార్యక్రమం ద్వారా శుద్ధి చేసిన స్వచ్ఛమైన నల్లా నీటిని రాష్ట్రవ్యాప్తంగా నూటికి నూరుశాతం ఇండ్లకు సరఫరా చేస్తుండటంతో ప్రజలను రోగాల నుంచి కాపాడగలుగుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఫలితంగా ప్రజారోగ్యం గుణాత్మకంగా మెరుగుపడిందన్నారు. అదే సందర్భంలో తల్లీ, బిడ్డల సంరక్షణే లక్ష్యంగా ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్స్‌ పథకం విజయవంతమై, మాతా శిశు సంక్షేమం మెరుగు పడిందన్నారు. కల్యాణలక్ష్మి పథకంతో బాల్య వివాహాలు తగ్గిపోయి, తద్వారా బాల్య ప్రసవాలకు అడ్డుకట్ట వేసినట్లయిందని తెలిపారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat