Home / SLIDER / రేపే ఖమ్మంలో వైఎస్ షర్మిల సభ..?

రేపే ఖమ్మంలో వైఎస్ షర్మిల సభ..?

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కానుంది ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో రేపు జరిగే బహిరంగ సభలో వైఎస్   షర్మిల తన పార్టీ పేరు, జెండా, అజెండా, పార్టీ లక్ష్యాలను ప్రకటించనున్నారు.

సంకల్ప సభ పేరుతో నిర్వహించే ఈ సభకు కేవలం 6 వేల మందికే పోలీసులు అనుమతి ఇచ్చారు. రేపు ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న షర్మిల.. సాయంత్రం ఐదు నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే సభలో తల్లి విజయలక్ష్మితో కలిసి పాల్గొననున్నారు