దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవుతోంది కొత్తగా 1,45,384కేసులు వచ్చాయి. మహమ్మారి బారినపడి మరో 794 మంది ప్రాణాలు కోల్పోయారు ఒక్కరోజే రికార్డు స్థాయిలో కేసులు నమోదవడం కలవరపెడుతోంది.
ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 1.32 కోట్లు దాటింది. మరణాలు 1,68,436కు చేరుకున్నాయి. యాక్టివ్ కేసులు మొత్తం 10,46,631కు చేరాయి. మరోవైపు ఇప్పటివరకు 9.80 కోట్ల మందికి టీకాలు వేశారు