Home / MOVIES / ప్రముఖ నటుడు వివేక్ కన్నుమూత

ప్రముఖ నటుడు వివేక్ కన్నుమూత

ఇటు తెలుగు అటు తమిళంతో పాటు కన్నడం లాంటి పలు భాషా చిత్రాల్లో తనకే సాధ్యమైన  కామెడీతో కోట్లాది ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించిన ప్ర‌ముఖ హాస్య న‌టుడు వివేక్. ఆయన ఈ రోజు తెల్ల‌వారుఝామున 4.35 ని.ల‌కు గుండెపోటుతో క‌న్నుమూశారు. ఆయ‌న మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రికి షాకింగ్‌గా ఉంది.

క‌మెడీయ‌న్‌గానే కాకుంగా మాన‌వ‌తా వాదిగా,సామాజిక చైత‌న్యం గ‌ల వ్య‌క్తిగా అందరి ప్ర‌శంస‌లు అందుకున్న వివేక్ ఇలా హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో అభిమానులు, స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు శోక సంద్రంలో మునిగారు. ఆయ‌న మృతికి ప్ర‌కాశ్ రాజ్, ఖుష్బూ, నివీన్ పాలి వంటి ప‌లువురు సెల‌బ్రిటీలు సంతాపం తెలియ‌జేశారు.

నా స్నేహితుడు వివేక్ ఇంత త్వ‌ర‌గా వదిలి వెళ‌తాడ‌ని ఊహించ‌లేదు. ఆలోచ‌న‌లు మ‌రియు చెట్ల‌ను నాటినందుకు ధ‌న్యవాదాలు. మీ తెలివి తేట‌లు, కామెడీతో మ‌మ్మ‌ల్ని అల‌రించినందుకు ధ‌న్య‌వాదాలు. మిమ్మ‌ల్ని చాలా మిస్ అవుతాం అని ప్ర‌కాశ్ రాజ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు .

లెజెండ్ ఇక లేర‌ని న‌మ్మ‌లేక‌పోతున్నాం. మీతో ప‌ని చేసిన క్ష‌ణాలు ఎప్పుడు మా మదిలో నిలిచి ఉంటాయి. కుటుంబానికి ప్ర‌గాఢ సానూభూతి తెలియ‌జేస్తున్నాను – మోహ‌న్ రాజా

వివేక్ లేడ‌నే వార్త పెద్ద షాకింగ్. ఎంతో చురుకైన వ్య‌క్తి ఇంత త్వ‌రగా మ‌న‌ల్ని వ‌దిలి వెళ్ల‌డం బాధ‌గా ఉంది. మీరు ఉన్న‌న్ని రోజుల మ‌మ్మ‌ల్ని ఎంత‌గానో ఎంట‌ర్టైన్ చేశారు. ఇప్పుడు క‌న్నీళ్లు, బాధ‌ల‌ను మిగిల్చి వెళ్లారు అంటూ ఖుష్బూ భావోద్వేగంతో ట్వీట్ చేసింది.