మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఇటీవల కరోనా బారినపడిన ఆయన చికిత్స నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు.
నిన్న రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి రాష్ట్ర విభజన అనంతరం అధినేత చంద్రబాబుతో విభేదించారు.
2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయాలని ఎన్టీఆర్ ఘాట్ వద్ద సంచలన ప్రకటన చేసి టీడీపీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఆయన బీజేపీలో చేరారు.