తెలంగాణలో కొత్త జోన్ల విధానం ఖరారు అయిన సంగతి విదితమే..దీంతో ఉద్యోగాల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్-1, 2, 3 సహా ఇతర పోస్టుల భర్తీకి లైన్ క్లియరైంది.
ఇక ప్రభుత్వ శాఖలు రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఖరారు చేయగానే నోటిఫికేషన్లు రానున్నాయి. గ్రూప్-1 వంటి పోస్టులు జోన్ల కారణంగానే భర్తీకి నోచుకోలేదు. ఇప్పుడిక 4వేలకుపైగా పోస్టులు పడే ఛాన్సుంది. ప్రభుత్వం చెప్పిన 50వేల ఉద్యోగాలకూ కొత్త జోనల్ విధానం అమలు కానుంది.