Home / SLIDER / వైద్యారోగ్య శాఖ‌కు సీఎం కేసీఆర్ కీల‌క ఆదేశాలు..

వైద్యారోగ్య శాఖ‌కు సీఎం కేసీఆర్ కీల‌క ఆదేశాలు..

‌తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్.. వైద్యారోగ్య శాఖ‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. దేశంలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్ల‌లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని అప్డేట్‌గా ఉండేలా చూసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్ర‌స్తుతం వేస‌వి కాలం కావ‌డం, దీనికి తోడు అన్ని ఆస్ప‌త్రులు క‌రోనా రోగుల‌తో నిండి ఉన్న నేప‌థ్యంలో అగ్నిప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాల‌న్నారు. రోగులు ఎక్కువ ఉన్న గాంధీ, టిమ్స్ లాంటి ఆస్ప‌త్రుల్లో ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా ఫైరింజ‌న్లు అందుబాటులో ఉంచాల‌ని సూచించారు.

ప్ర‌తి ఆస్ప‌త్రికి ఆక్సిజ‌న్ చేరేలా స‌మ‌న్వ‌యం

VDO.AI
యుద్ద విమానాలను ఉపయోగించి తీసుకువస్తున్న ఆక్సిజన్‌ను అవసరం ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్ కి చేరేవిధంగా సమన్వయం చేసుకోవాలని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.

క‌రోనా నిర్ధార‌ణ కిట్స్ కొర‌త రాకుండా చూడాలి

కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో పరీక్షలు చేయించుకొనే వారి సంఖ్య దేశ వ్యాప్తంగా పెరగడంతో కరోనా నిర్ధారణ పరీక్ష కిట్స్ కొరత ఏర్పడకుండా ప్రపంచంలో ఎక్కడ అందుబాటులో ఉన్నా వాటిని మన రాష్ట్రానికి తెచ్చే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఎయిర్‌లిఫ్ట్‌ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ లేఖ రాయ‌నున్నారు. కిట్స్‌ కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.

హోం ఐసోలేష‌న్ కిట్స్ అందించాలి

కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వెంటనే హోం ఐసోలేష‌న్‌ కిట్స్ అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ మానిట‌ర్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్ని లక్షల మందికి అయిన హోం ఐసోలేష‌న్‌ కిట్స్ అందించడానికి వీలుగా కిట్స్ను సమకూర్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రజలు కూడా కరోనా నియంత్రణకు పూర్తి సహకారం అందించాలని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat