ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టనుందట. మహేష్ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం నిధిని పరిశీలిస్తున్నారట. అయితే మహేష్ సినిమాలో నిధి మెయిన్ రోల్లో కనిపిస్తుందా. లేక సెకండ్ హీరోయినా అన్నది చూడాలి.