Home / SLIDER / నాగార్జున సాగ‌ర్‌లో టీఆర్ఎస్ ఘ‌న విజ‌యం

నాగార్జున సాగ‌ర్‌లో టీఆర్ఎస్ ఘ‌న విజ‌యం

నాగార్జున సాగ‌ర్ గ‌డ్డ‌పై మ‌రోసారి గులాబీ జెండా రెప‌రెప‌లాడింది. సాగ‌ర్ ప్ర‌జ‌లు గులాబీ జెండాను గుండెల‌కు హ‌త్తుకున్నారు. తాజాగా జ‌రిగిన‌ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ ఘ‌న‌ విజ‌యం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ 19,281 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య అకాల మ‌ర‌ణంతో సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ క్ర‌మంలో ఏప్రిల్ 17న ఉప ఎన్నిక‌కు పోలింగ్ ప్ర‌క్రియ జ‌రిగిన విష‌యం తెలిసిందే.

నోముల భ‌గ‌త్ ప్ర‌తి రౌండ్‌లోనూ మంచి ఆధిక్యం క‌న‌బ‌రిచారు. వ‌రుస‌గా తొలి తొమ్మిది రౌండ్ల‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ ఆధిక్యం ప్ర‌ద‌ర్శించ‌గా, 10, 11, 14వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

మ‌ళ్లీ మిగ‌తా అన్ని రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ పార్టీ దూకుడు ప్రద‌ర్శించింది. కారు వేగానికి హ‌స్తం, క‌మ‌లం పార్టీలు తుడిచి పెట్టుకుపోయాయి.ఈ ఎన్నిక‌లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి రెండో స్థానానికి ప‌రిమితం కాగా, బీజేపీ అభ్య‌ర్థి ర‌వి నాయ‌క్ డిపాజిట్ గ‌ల్లంతు అయింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat