ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ దంపతులు హవాయిలో మరో 600 ఎకరాలను కొనుగోలు చేశారు. హవాయిలోని కవాయి ద్వీపంలో ఈ భూమిని 53 మిలియన్ డాలర్లకు (రూ.391 కోట్లు) కొన్నారు. హవాయిలో జుకర్ బర్గ్కు ఇప్పటికే భూమి ఉండగా, ప్రస్తుత కొనుగోలుతో అక్కడ ఆయన భూమి మొత్తంగా 1300 ఎకరాలకు చేరింది.