Home / MOVIES / సరికొత్తగా “యాత్ర” మూవీ దర్శకుడు

సరికొత్తగా “యాత్ర” మూవీ దర్శకుడు

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా డైరెక్టర్ మహి రాఘవ బయోపిక్ తీసిన మూవీ యాత్ర. ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ప్రస్తుతం మహి ఓ సెటైరికల్ కామెడీ స్కిప్ట్ రెడీ చేస్తున్నాడట. ఈ సినిమాలో ‘జెర్సీ’ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటిస్తోందని టాక్. పలువురు కమెడియన్లను ఈ సినిమా కోసం ఎంపిక చేశారట. అయితే ఇది కామెడీ జోనర్లో తెరకెక్కుతున్నప్పటికీ.. ఇందులోనూ తనదైన మార్క్ పొలిటికల్ టచ్ ఇవ్వనున్నాడట మహి.