ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామ రాజుకి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించినట్లు సీఐడీ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఆయనకు వై కేటగిర భద్రతను కొనసాగించేందుకు సీఐడీ కోర్ట్ అనుమతించింది.
ఈ మేరకు న్యాయవాది లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం రఘురామను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారని, ఆ తర్వాత అక్కడి నుంచి రమేష్ హాస్పిటల్లో వైద్యం అందిస్తారని తెలిపారు.
అయితే రఘురామకృష్ణంరాజు ఆరోగ్యం మెరుగుపడే వరకు ఆయనను జైలుకు తలలించరని లాయర్ లక్ష్మి నారాయణ తెలిపారు.