Home / ANDHRAPRADESH / Mp రఘురామ కాళ్లు ఎందుకు రంగు మారాయంటే..?

Mp రఘురామ కాళ్లు ఎందుకు రంగు మారాయంటే..?

తనను అరికాళ్లపై కర్రతో, రబ్బరు తాడుతో కొట్టారని రఘురామ రాజు దిగువ కోర్ట్‌లో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎల్లో మీడియా మరియు తెలుగుదేశం జనసేన సంబంధించిన సామాజిక మధ్యమలో దానిని చిలువలు, వలువలు చేసి..ఆ అరికాళ్ల ఫొటోలను పతాక శీర్షికలో ప్రచురించింది. అదే ఫొటోలనే తెలుగు దేశం పార్టీ వైరల్ చేసింది. అయితే..ఇదంతా కట్టు కథేనని…ఆయనకు ఎలాంటి గాయాలూ లేవని హైకోర్ట్ నియమించిన వైద్యుల కమిటీ ఆదివారం తేల్చడంతో ఎల్లో మీడియాకు ఎటూ పాలుపోవడం లేదు.

ఎడెమా(వాపు) వల్ల కాళ్లు అలా అయ్యాయని వైద్య నిపుణులు ఇచ్చిన రిపోర్ట్‌ను న్యాయమూర్తులు కోర్టులో చదివి వినిపించారు. సూక్ష్మనాళాలు కనుక దెబ్బతిని నీళ్లు కాళ్లలోకి చేరితే సహజంగా ఈ ఎడెమ వస్తుంటుంది. కాళ్లు స్వల్పంగా వాచి నీరు చేరి ఉబ్బినట్లు కనిపిస్తాయి. ఎక్కువ సేపు నిల్చున్నా……అదే పనిగా కూర్చున్నా ఇలా జరగడం సహజమేనని కూడా వైద్య నిపుణులు నివేదికలో పేర్కొన్నారు. రఘురామ రాజు షుగర్‌ వ్యాధిగ్రస్తుడు కనుక ఇది సహజమేనన్నది వైద్యుల మాట. ఈ వాస్తవాలను పక్కన పెట్టి అప్పటికప్పుడు అల్లిన కథను మరింతగా ప్రచారం చేయడానికి ఎల్లో మీడియా నానాపాట్లు పడుతుండటం తెలిసిందే.

చంద్రబాబు సైతం గవర్నర్‌కు, రాష్ట్రపతికి లేఖలు పేరిట హడావుడి మొదలు పెట్టారు. ఇదంతా తమ పాత్రలు బయటకు వస్తాయనే భయంతోనే వారు చేస్తున్నారని , రఘురామ రాజు కస్టడీ కొనసాగితే విచారణలో తప్పకుండా సూత్రధారులంతా బయటపడతారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat