Home / ANDHRAPRADESH / ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికే సోనుసూద్ సాయం

ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికే సోనుసూద్ సాయం

కరోనా కష్టకాలంలో అందరికి అండగా నిలబడుతున్న హెల్పింగ్ స్టార్ సోనూ సూద్ సామాన్యులకే కాదు సర్కారులకు సాయం చేస్తున్నారు.

ఏపీలోని నెల్లూరు జిల్లాలో రూ.1.5 కోట్లతో 2 టన్నుల ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. నెల్లూరులోని సోనూ స్నేహితులు తమ జిల్లాకు ఏమైనా సాయం చేయాలని కోరారు.

అవసరాలు ఏంటో చెప్పండని కోరగా వారు కలెక్టర్ చక్రధర్ బాబుతో మాట్లాడించారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కలెక్టర్ చెప్పగా దానికి సోనూ ఓకే చెప్పారు.