Home / NATIONAL / అసలు టూల్‌కిట్‌ రభస ఏమిటి?

అసలు టూల్‌కిట్‌ రభస ఏమిటి?

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారంతో, విద్వేష జాఢ్యంతో ప్రతిపక్షాలపై నిత్యం విషం గక్కే బిజెపి, కాషాయ పరివారం ఈ సారి తాను తవ్వుకున్న గోతిలో తానే పడింది.

– దేశాన్ని, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం చేసుకున్న టూల్‌కిట్‌ చూడండి అంటూ ఎఐసిసి అధికారిక లెటర్‌ హెడ్‌ కాపీగా ఒక పత్రాన్ని జతచేసి ‘కాంగ్రెస్‌టూల్‌కిట్‌ ఎక్స్‌పోజ్డ్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సహా పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

– సామాజిక మాధ్యమాల్లో ఉన్న తప్పుడు కథనాల నిగ్గుతేల్చే ఆల్ట్‌న్యూస్‌.కామ్‌ వంటి సంస్థలు బిజెపి పోస్టు చేసిన లెటర్‌ హెడ్‌ నకిలీదని నిర్ధారించాయి. తప్పుడు కథనాలు పోస్టు చేసినవారి ఖాతాలను తొలగించాలని కాంగ్రెస్‌ పార్టీ కూడా ట్విట్టర్‌కు లేఖ రాసింది.

దీంతో బిజెపి ఎంపీలు, కేంద్ర మంత్రులు పోస్టు చేసిన ‘కాంగ్రెస్‌టూల్‌కిట్‌ ఎక్స్‌పోజ్డ్‌’ పోస్టులు నకిలీ అని నిర్ధారిస్తూ ఆ పోస్టులకు ‘మ్యానిప్యులేటెడ్‌ మీడియా’ అని ఒక ట్యాగ్‌ను ట్విట్టర్‌ జత చేసింది.

– ఈ పరిణామంతో బిత్తరపోయిన బిజెపి వెంటనే కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖను బరిలోకి దింపింది. అది వెంటనే స్పందించి ట్విట్టర్‌లో కొందరు రాజకీయ నాయకుల పోస్టులకు ‘మ్యానిప్యులేటెడ్‌ మీడియా ట్యాగ్‌’ తక్షణమే తొలగించాలని ఆదేశించింది.

– ట్విట్టర్‌ ఈ విషయంలో మాత్రం గట్టిగా నిలబడింది. ఆ పోస్టులు నకిలీవి కాబట్టే ‘మ్యానిప్యులేటెడ్‌ మీడియా’ ట్యాగ్‌ ఉంచామని తెలిపింది. అంతేకాదు కేంద్ర ఐటి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా మరికొందరు బిజెపి నేతల పోస్టులకు ‘మ్యానిప్యులేటెడ్‌ మీడియా’ ట్యాగ్‌ను ట్విట్టర్‌ జత చేసింది.

అంటే బిజెపి వాళ్లు చేస్తున్న ఈ పోస్టులన్నీ తప్పుడు సమాచారంతో కూడినవని అర్థం. తప్పుడు కథనాలు పోస్టు చేసినవారిలో బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా, ఎంపీలు స్మృతీ ఇరానీ, తేజస్వీ సూర్య, బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర, రాజ్యసభ సభ్యుడు వినరు సహస్రబుద్దే, బిజెపి సోషల్‌ మీడియా జాతీయ ఇన్‌ఛార్జీ ప్రీతి గాంధీ, ఆంధ్రప్రదేశ్‌ బిజెపి ఇన్‌ఛార్జీ సునీల్‌ డియోధర్‌, బిజెపి మీడియా ప్యానలిస్టు ఛారు ప్రగ్యా, బిజెపి ఢిల్లీ ప్రధానకార్యదర్శి కుల్జీత్‌ సింగ్‌ ఛాహల్‌ తదితరులు ఉన్నారు. వీరందరి తప్పుడు ట్వీట్లకు ట్విట్టర్‌ ‘మ్యానిప్యులేటెడ్‌ మీడియా’ ట్యాగ్‌ జత చేసింది.

టూల్‌కిట్‌ అంటే ఏమిటీ?

టూల్‌కిట్‌ అంటే ఏదైనా అంశానికి సంబంధించి ప్రణాళికబద్ధమైన ప్రచార ఎత్తుగడగా చెప్పవచ్చు. కంటెంట్‌ను, కౌంటర్‌ కంటెంట్‌ను ఏ విధంగా ఇస్తే బావుంటుంది? ఏఏ విషయాలను ప్రధానంగా ప్రస్తావించాలి? ఇలాంటివి అన్నమాట. అంతేగానీ ఇదేదో కొత్త తరహా సాఫ్ట్‌వేర్‌ గానీ, హార్డ్‌వేర్‌ గానీ కాదు. సోషల్‌ మీడియాకు సంబంధించిన ప్రచార వ్యూహం మాత్రమే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat