Home / MOVIES / తానేమి తక్కువ కాదంటున్న నిధి అగర్వాల్

తానేమి తక్కువ కాదంటున్న నిధి అగర్వాల్

టాలీవుడ్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ సేవా కార్యక్రమాలతో అందరి మనసులు గెలుచుకుంటోంది. గతేడాది కరోనా సమయంలో తన వంతు సాయం చేసిన నిధి..

తాజాగా ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ పేరుతో ఒక ఆర్గనైజేషన్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ కష్టకాలంలో ఎవరికి సాయం కావాలన్నా అడగాలని, తనకు చేతనైన సాయం చేస్తానని తెలిపింది. ఆర్గనైజేషన్ కోసం తనతో పాటు తన టీం కూడా పని చేస్తుందని నిధి పేర్కొంది.