కరోనా కట్టడి కోసం విధించిన లాక్డ్ డౌన్ మంచి ఫలితాలను ఇస్తోంది. గత 24 గంటల్లో 91 వేల కొవిడ్ పరీక్షలు చేయడం జరిగింది..
ఇందులో 3,762 మందికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు వెల్లడించారు.
మరో 20 మంది కరోనాతో మృతి చెందారని పేర్కొన్నారు. పాజిటివిటీ రేటు గణనీయంగా 4.1 శాతానికి తగ్గిందని, మరణాల రేటు 0.56 శాతంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.