తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీయెస్ట్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది పూజాహెగ్డే. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ఫాలోవర్లతో షేర్ చేసుకుంటుంది.
ఈ బ్యూటీ సన్ షైనింగ్ స్టిల్స్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పూజాహెగ్డే గోల్డెన్ కలర్ ఎఫెక్ట్ లో పొడి బారిన జుట్టుతో చక్ చక్ మని మెరుస్తుండగా ఫ్యాషన్,, సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రాహుల్ ఝాంగియాని తన కెమెరాలతో బంధించాడు.
పూజాహెగ్గే ఫొటో షూట్ స్టిల్స్ ఇపుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. పూజా హెగ్డే తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, ప్రభాస్ తో రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తోంది. ఆచార్య చిత్రంలో కీ రోల్ పోషిస్తోంది. రోహిత్ శెట్టి డైరెక్షన్ లో సర్కస్ మూవీ, నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో విజయ్ 65 వ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.