తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఇందులో సీనియర్ హీరోయిన్ని తీసుకోనున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చాలా వరకు పూర్తయిందట. మరో షెడ్యూల్ షూటింగ్ జరిగితే టాకీపార్ట్ మొత్తం పూర్తవుతుందని సమాచారం.
మహేష్ బాబుతో అనిల్ రావిపూడి తీసిన ‘సరిలేరు నీకెవ్వరు’తో సీనియర్ హీరోయిన్ సంగీత రీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె పాత్రకు మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి ఈమెకి ‘ఎఫ్ 3’ లో మంచి పాత్ర డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈమె పాత్రకి సంబంధించిన సన్నివేశాలను మైసూర్లో చేయబోతున్న షెడ్యూల్లో చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఇక సంగీత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’లోని లాహే లాహే సాంగ్‌లో కనిపించబోతోంది.