Home / SLIDER / నాటి పచ్చని ప్రగతి స్వప్నం నేటి నిజం

నాటి పచ్చని ప్రగతి స్వప్నం నేటి నిజం

నిన్న మొన్ననే వచ్చింది కదా అన్నట్టుగా ఉన్న తెలంగాణ రాకడకు అప్పుడే ఏడేండ్లు. ఎక్కడ చూసినా నెర్రెలు- మట్టి నిండిన ఒర్రెలు, సాగు మొత్తం ఆగమయ్యిందే అని దిగాలు పడ్డ తెలంగాణ. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ అయ్యిందంటే ఎంత అద్భుతం! అందుకు ఎన్ని ప్రణాళికలు కావాలి, ఎంత ఆచరణాత్మక కృషి జరగాలి? ‘మీకు వ్యవసాయం వస్తదా?’ అని ప్రశ్నించిన నోళ్లతోనే.. ‘మీకే వ్యవసాయం వస్తదని’ చెప్పించాలంటే ఎంత సమర్థవంతమైన నాయకత్వం కావాలి? ఎంతటి అకుంఠిత కార్యాచరణ అవసరం. అంత అద్భుతం జరిగింది కాబట్టే, కరోనా కష్టకాలంలోనూ దేశంలో రైతులనుంచి వరిధాన్యం సేకరణలో ద్వితీయస్థానంలో ఉన్నది తెలంగాణ. ఇది చాలదా పచ్చని తెలంగాణకు ప్రతీక. ఈ నిలువెత్తు ప్రగతిని మరే రాష్ట్రంలోనైనా చూడగలమా? అవసరం కోసం రాజకీయాలు చేసేవాళ్లు, అవకాశాల కోసం రాజకీయా లు చేసేవాళ్లు ఎన్నైనా మాట్లాడుతుంటారు, కానీ బాధ్యతల్ని భుజాలపై మోసే నాయకత్వానికే తెలుస్తుంది కదా ప్రజల జీవితాలను ప్రగతిపథం వైపు ఎట్లా నడిపించాలో!

👉 *సమగ్ర ప్రణాళిక #సమర్థ_నాయకత్వం*

2014 నాటికి 7,778 మెగావాట్లున్న స్థాపిత విద్యుత్తును 16,570 మెగావాట్లకు చేర్చారు. ఏడేండ్లలో 8,792 మెగావాట్ల విద్యుత్‌ సరఫరాను వృద్ధిలోకి తెచ్చా రు. రాష్ట్రం ఏర్పడేనాటికి 5,661 మెగావాట్లున్న వినియో గం 13,688 మెగావాట్లకు చేరింది. తెలంగాణ వస్తే రాష్ట్రం చీకటవుతుందని, కరెంటు తీగలమీద బట్టలు ఎండేసుకోవాలని శాపనార్థాలు పెట్టి, హేళన చేసినోళ్ల నోళ్లు మూతపడేలా తలసరి విద్యుత్‌ వినియోగం 2,071 యూనిట్లతో తెలంగాణను దేశంలో మొదటి స్థానంలో నిలిపి చరిత్ర తిరగ రాశారు.

తెలంగాణ వచ్చేనాటికి సాగు చేయదగిన భూ విస్తీర్ణం ఒక కోటి 40 లక్షల ఎకరాలు ఉంటే, దీనిలో సాగు జరిగింది కేవలం 50 శాతం మాత్రమే. జనాభాలో దాదాపు 60 శాతం ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయరంగానికి ఈ విస్తీర్ణం ఏ మాత్రం సరిపోలేదు. అందుకే వ్యవసాయ పనులు దొరక్క వలసలు వెళ్లేవాళ్లు. ఏ ఊర్లో చూసినా ‘వలసలతో ఇంటికొకరు అబ్సెంట్‌- ఇంటింటికి అప్పులు ప్రజెంట్‌’ అన్నట్టుండేది పరిస్థితి. ఊర్లున్నోళ్లు ఎవుసం చేద్దమంటే నీళ్లు లేవు, బాయిల్నో, బోర్లనో నీళ్లుండి పంటలేస్తే కరెంటు ఎప్పుడస్తదో తెలియదు. త్రీ ఫేజ్‌ అనుకొని స్టాటర్‌ ఆన్‌ చేస్తే టూ ఫేజ్‌ వచ్చి మోటర్లు కాలిపోవుడు- ఎవుసం ఆగిపోవుడు.. ఏ ఊర్ల చూసినా ఇదే తంతు. పంటలు పండుడే గగనం అనుకుంటే పండిన పంటను కోనేవాళ్లు లేక, కొన్నా గిట్టుబాటు దొరకక నానాయాతన. ఇక విత్తనాలు, ఎరువులు దొరకాలంటే లాఠీ దెబ్బలు తప్పేవి కాదు. పట్టెడన్నం పెట్టే రైతుకు పడరాని పాట్లు. ఎక్కడ చూసినా రైతు ధర్నాలు, రాస్తారోకోలు. గతకాలపు జ్ఞాపకాలు గుర్తుకొస్తే గుండె జలదరిస్తది. కానీ తెలంగాణ వచ్చినంక కేసీఆర్‌ నాయకత్వం వ్యవసాయానికి సాయం చేసింది. పటిష్ట ప్రణాళికలతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించింది. ప్రతిదీ ఒక పద్ధతిలో, ఒక ప్రాసెస్‌లో ‘ఎంపారికల్‌ ఎక్స్‌పీరియన్స్‌’తో ఎన్ని ఒడు దొడుకులు ఎదురైనా నిలబడేలా వ్యవసాయరంగాన్ని తీర్చిదిద్దారు.

తెలంగాణ వచ్చేనాటికి విస్తీర్ణ యోగ్యమైన కోటి 40 లక్షల ఎకరాల భూమిలో సగానికి కొంచెం అటూ ఇటుగా రైతులు సాగుచేసేవారు. కానీ నేడు 2 కోట్ల 5 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. అంటే, ఏడేండ్లలో 50 శాతానికి పైగా వృద్ధి చెందింది. వ్యవసాయరంగం ఏటా 14.5 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తూ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదుగుతున్నది.

👉 *ప్రగతిబాటకు బాసటగా 24 గంటల #ఉచిత_కరెంటు*

కరెంటు వచ్చుడే సమస్య ఉండే రోజుల్లో చార్జీలు రైతులను బెంబేలెత్తించేవి. దీంతో అటు కాలిపోతున్న మోటర్లకు పైసలు పెట్టలేక, వచ్చీరాని కరెంటుకు పుణ్యానికి బిల్లులు కట్టలేక రైతులు తీవ్రఇబ్బందులు పడేవారు. తెలంగాణ వ్యవసాయాన్ని దెబ్బతీస్తున్న విద్యుత్‌రంగాన్ని ప్రభుత్వం సవాల్‌గా తీసుకున్నది. ఉత్పత్తిని పెంచింది. తక్షణ అవసరాల కోసం పక్క రాష్ర్టాలనుంచి కొనుగోలు చేసింది. అందుకే నిర్భయంగా 24 గంటల ఉచిత కరెంటు అందిస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అప్పటిదాక 6 గంటల కరెంటు ఇవ్వడానికి నానా తంటాలు పడ్డ పార్టీల నేతలకు కేసీఆర్‌ ప్రకటన అసాధ్యమనిపించింది. అందుకే, ఈ అసాధ్యాన్ని.. సుసాధ్యం చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని ప్రతిపక్షనేతలు బింకాలు పలికారు. సరిగ్గా ఏడాదిలో 24 గంటల ఉచిత కరెంటును సరఫరా చేసి చూపించారు కేసీఆర్‌. 2018లో విపక్ష నాయకులకు ప్రజల చేత శాశ్వతంగా విరామం ఇప్పించారు.

విద్యుత్‌కోసం కేసీఆర్‌ అనునిత్యం కృషిచేశారు. 2014 నాటికి 7,778 మెగావాట్లున్న స్థాపిత విద్యుత్తును 16,570 మెగావాట్లకు చేర్చారు. ఏడేండ్లలో 8,792 మెగావాట్ల విద్యుత్‌ సరఫరాను వృద్ధిలోకి తెచ్చా రు. రాష్ట్రం ఏర్పడేనాటికి 5,661 మెగావాట్లున్న వినియో గం 13,688 మెగావాట్లకు చేరింది. తెలంగాణ వస్తే రాష్ట్రం చీకటవుతుందని, కరెంటు తీగలమీద బట్టలు ఎండేసుకోవాలని శాపనార్థాలు పెట్టి, హేళన చేసినోళ్ల నోళ్లు మూతపడేలా తలసరి విద్యుత్‌ వినియోగం 2,071 యూనిట్లతో తెలంగాణను దేశంలో మొదటి స్థానంలో నిలిపి చరిత్ర తిరగ రాశారు. ఈ విద్యుత్‌రంగ ప్రగతి తెలంగాణ వ్యవసాయాన్ని సుసంపన్నం చేసింది. బోర్లలో, బాయిల్లో, కాలువల్లో నీళున్నా కరెంటు లేక పారించుకోలేకపోయిన అనేకమంది రైతులను పొలంబాట పట్టించింది. అప్పటిదాక పడావు పడ్డ భూములన్నింటికీ తిరిగి పచ్చదనం పరిచింది.

👉 *ఊరూరా #జలసిరులు*
రైతుల సాగునీటి కష్టాన్ని తీర్చేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం భగీరథ ప్రయత్నమే చేస్తున్నది. తెలంగాణ ఏర్పాటునుంచి నేటివరకు అనేక ప్రాజెక్టులను పూర్తిచేసింది. ఇంకా కొన్ని ప్రాజెక్టుల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాలను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో అంతకుమించి గ్రామీణ నీటి వనరులను పునరుద్ధరించే పనిని ముందటేసుకున్నది. ‘మిషన్‌ కాకతీయ’ ద్వారా తెలంగాణలో ఉన్న దాదాపు 46,531 చెరువులు, చిన్నపాటి కుంటలను పునరుజ్జీవింపజేసింది. కాలువలను ఆధునికీకరించింది. చివరి ఆయకట్టుకూ నీటి లభ్యత సాధించేలా అమోఘమైన ప్రణాళికలు సిద్ధం చేసి అమలుపరిచింది.

దేశంలో 20, 30 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు కట్టడానికే ఎన్నో ఏండ్లు తీసుకుంటున్న సమయంలో 200 టీఎంసీల నిలువ సామర్థ్యం, అవసరాన్ని బట్టి దాదాపు 500 టీఎంసీల వరకు సామర్థ్యం ఉండే కాళేశ్వరం లాంటి అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని మూడేండ్లలో పూర్తిచేసి ప్రారంభించడం కేసీఆర్‌ దక్షతకు నిదర్శనం. ఒకవైపు భారీ ప్రాజెక్టులను నిర్మిస్తూనే మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులను సైతం సర్కారు అంతే వేగంగా నిర్మించింది. ముఖ్యంగా ఉమ్మడిరాష్ట్రంలో ఏండ్ల తరబడి సాగదీతకు గురై, వెనక్కి నెట్టివేయబడ్డ కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎల్లంపల్లి, భీమా, మిడ్‌ మానేరు, సింగూరు, కొమ్రం భీం, నీల్వాయి, జగన్నాథ్‌పూర్‌, కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌ ప్రాజెక్టులను పూర్తిచేసింది. ఇక చనఖా- కొరటా, సదర్‌మట్‌, సీతమ్మసాగర్‌, గట్టుప్రాజెక్టులు చివరిదశలో ఉండగా సమ్మక్క బ్యారేజీ ఇప్పటికే పూర్తయింది. ఇవేకాదు, నీటిపారుదల రంగంలో రికార్డులు తిరగరాస్తూ.. 11 నెలల్లోనే ఖమ్మంలో భక్త రామదాసు, జోగులాంబ గద్వాల జిల్లాలో తుమ్మిళ్ల ఎత్తిపోతలను పూర్తిచేసింది. ప్రాజెక్టులన్నీ పూర్తయితే దాదాపు కోటిన్నర ఎకరాలకు సాగునీరు అందుతుంది. తెలంగాణలోని ప్రతి అంగుళం భూమికి సాగునీరు చేరుతుంది. ఇవన్నీ ఇప్పు డు తెలంగాణ వ్యవసాయ వృద్ధికి తోడ్పడుతున్నాయి. సంకల్పించిన ప్రాజెక్టులన్నీ పూర్తయితే దేశంలో తెలంగాణ వ్యవసాయరంగం ఒక ‘రోల్‌ మోడల్‌’గా నిలుస్తుంది.

👉 *పెరిగిన విస్తీర్ణం #తగ్గిన_పేదరికం*
‘రైతుబంధు’ పథకం ద్వారా లబ్ధి పొందేవారిలో 41 లక్షల మంది రెండెకరాలలోపున్న రైతులు, 11 లక్షలమంది ఐదు ఎకరాలలోపున్నవారు ఉన్నారు. 5-10 ఎకరాలలోపు భూములున్నవారు 4.44 లక్షలమంది, 10 ఎకరాలకు పైచిలుకు భూములున్నవారు 94 వేలమంది, 25 ఎకరాలకు భూములున్నవారు 6,488 మంది ఉన్నారు. ఈ లెక్కన దాదాపు 95 శాతం మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే ‘రైతుబంధు’ లబ్ధిదారులన్న విషయంలో మరోమాట లేదు.

ఒకపక్క 24 గంటల ఉచిత విద్యుత్తు, మరోపక్క సమృద్ధిగా సాగునీటి వనరులు, సమయానికి విత్తనాలు, అందుబాటులో ఎరువులు, అండగా రైతుబంధు, కుటుంబానికి భరోసానిచ్చే రైతుబీమా పథకాల వల్ల వ్యవసాయరంగం అనూహ్యంగా పుంజుకున్నది. తెలంగాణ వచ్చేనాటికి విస్తీర్ణ యోగ్యమైన కోటి 40 లక్షల ఎకరాల భూమిలో సగానికి కొంచెం అటూ ఇటుగా రైతులు సాగుచేసేవారు. కానీ నేడు 2 కోట్ల 5 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. అంటే, ఏడేండ్లలో 50 శాతానికి పైగా వృద్ధి చెందింది. వ్యవసాయరంగం ఏటా 14.5 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తూ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదుగుతున్నది. కరోనా విలయంలోనూ తెలంగాణ దిగుబడులు ఏ మాత్రం తగ్గకపోగా మరింత పెరగడం ప్రభుత్వ ఉత్కృష్ట ప్రణాళికలకు తార్కాణం. 2019- 20 సంవత్సరంలో తెలంగాణలో 193 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం పండింది. అందులో 111 లక్షల 26 వేల మెట్రిక్‌ టన్నులను ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) తెలంగాణ నుంచే సేకరించింది. ఎఫ్‌సీఐ జాతీయస్థాయిలో సేకరించిన ధాన్యంలో తెలంగాణ వాటా 14.33 శాతంగా రికార్డయ్యింది. వరి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే రెండవ రాష్ట్రంగా నిలిచిందని స్వయంగా ఎఫ్‌సీఐ ప్రకటించింది. ఇక 2020 సంవత్సరం యాసంగిలో మన రాష్ట్రం ఎఫ్‌సీఐకి 64 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి అందించింది. ఈ ఒరవడి 2021లో రికార్డు స్థాయిలో ఇప్పటికే 68 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరింది. ఎఫ్‌సీఐ దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం ధాన్యంలో 55 శాతం మనదే కావడం గమనార్హం. ఒకనాడు తెలంగాణకు వ్యవసాయం రాదని ఈసడించుకున్నవాళ్లే నేడు తెలంగాణ వ్యవసాయాన్ని చూసి ఈర్షపడే విధంగా, వ్యవసాయం రంగంలో తెలంగాణ అపూర్వమైన ప్రగతిని సాధించగలిగింది. ఒక్క వరిసాగులోనే కాదు, పత్తిలాంటి వాణిజ్యపంటలు 60 లక్షల ఎకరాల్లో సాగు చేయడం ద్వారా తెలంగాణ, దేశంలోనే పత్తిని అత్యధికంగా పండిస్తున్న రెండో రాష్ట్రంగా అవతరించింది.

2015 వానకాలంలో 11.03 లక్షల మెట్రిక్‌ టన్నులు, యాసంగిలో 13.24 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉన్న ధాన్యసేకరణ ఇప్పుడు వానకాలంలోనే 48.85 లక్షల మెట్రిక్‌ టన్ను లు, యాసంగిలో 80 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరుతుందనే వార్తలే ఇందుకు నిదర్శనం. ఈ ప్రగతి గ్రామాల్లో కూలీల వలసలను నిలువరించింది. ఉన్న ఊర్లోనే ఉపాధి చూపిస్తున్నది.

👉 *విత్తనాలు, ఎరువుల నుంచి ధాన్యం సేకరణ దాక*
ఒకప్పుడు పంటలేసే సమయం వస్తే రైతుకు నిత్యం ఆందోళనే. విత్తనాలు దొరుకుతాయో, లేదోననే ఆందోళన రైతును ఆగం చేసేది. రోజుల తరబడి క్యూలో నిలబడ్డా విత్తనాలు దొరికేవి కావు. దీంతో సాంప్రదాయంగా పండించిన విత్తనాలను పంటగా వేసి దిగుబడి రాక, కూలీలకు, ఇతర ఖర్చులకు చేసిన అప్పులు తీరక రైతులు వేదనపడి, కొందరు ఆత్మహత్యలకు పాల్పడేవారు. కష్టపడి విత్తనాలు సంపాదించినా ఎరువులకోసం మళ్లీ యుద్ధం చేయాల్సి వచ్చేది.

విత్తనాలు దొరికి పంటేసి కాస్తంత ఊపిరిపీల్చుకున్నా ఎరువులు దొరక్క పంటలు చీడపీడలతో దెబ్బతినేవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అంతా క్రమశిక్షణతో సాగుతున్నది. భూముల్ని క్లస్టర్లుగా విభజించి.. ప్రతి ఎకరాకు కావాల్సిన సదుపాయాలను గుర్తించడం,గిట్టుబాటు పంట ల వైపు రైతులను ప్రోత్సహించడంతో వ్యవసా యం లాభసాటిగా మారింది. ప్రతి ఎకరాకు కావల్సిన విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం ముందే అంచనా వేసి సరిపడా సమకూర్చుతున్నది. 2015 వానకాలంలో 11.03 లక్షల మెట్రిక్‌ టన్నులు, యాసంగిలో 13.24 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉన్న ధాన్యసేకరణ ఇప్పుడు వానకాలంలోనే 48.85 లక్షల మెట్రిక్‌ టన్ను లు, యాసంగిలో 80 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరుతుందనే వార్తలే ఇందుకు నిదర్శనం. ఈ ప్రగతి గ్రామాల్లో కూలీల వలసలను నిలువరించింది. ఉన్న ఊర్లోనే ఉపాధి చూపిస్తున్నది.

👉 *#సమగ్ర_ప్రణాళికే పురోగతికి నాంది*
‘నాయకుని ప్రగతిశీలమైన ప్రణాళికలే రాజ్యం పురోభివృద్ధికి మెట్లవంటివి’ అంటారు మేధావులు. అదిప్పుడు తెలంగాణలో రుజువయ్యింది. కేసీఆర్‌ తీసుకున్న ప్రతీ నిర్ణయం వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించింది. తెలంగాణ రైతాంగానికి గుదిబండగా ఉన్న కరెంటు సమస్యకు కేసీఆర్‌ పరిష్కారం చూపించారు. ప్రతీ ఆయకట్టుకు నీరందేలా పటిష్ట ప్రణాళికలు రూపొందించి కేసీఆర్‌ అమలుచేశారు. సమస్యగా ఉన్న ఎరువులు, విత్తనాల సరఫరాను సరళం చేశారు. ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒక అగ్రి ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ను నియమించారు. పెట్టుబడి కోసం రైతుబంధు పథకం పెట్టి పెట్టుబడి సాయం అందించారు. ఫలితంగా తెలంగాణలో పంట విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పెరిగిన ఈ పంట దిగుబడులను కొనేందుకు పౌరసరఫరాల శాఖద్వారా ఏర్పాట్లుచేశారు. ప్రతీ గింజను గిట్టుబాటు ధరకు సేకరించారు. కేంద్రం నుంచి సహాయ నిరాకరణ కొనసాగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, పంటను నమ్ముకున్న రైతు ఆత్మస్థయిర్యం చెదరకుండా ప్రతీ గింజను కొనుగోలు చేశారు. కరోనా విలయం, అకాల వర్షాలు వచ్చి నా రైతు నష్టపోకుండా ఏర్పాట్లు చేసి రైతుల హృదయాన్ని కేసీఆర్‌ గెలిచారు. అయితే, చీకట్లో రాయేసేవాడికి లక్ష్యంతో పనిలేదన్నట్లు ప్రతిపక్ష నాయకులు విమర్శలే లక్ష్యం గా పబ్బం గడుపుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని విమర్శించాలనే దుగ్ధ తప్ప ప్రజాకాంక్ష కోసం వారు ఆలోచించకపోవడం దారుణం. అయితే, ప్రజలు విజ్ఞులు. ‘వ్యవసాయం దండగ’ అన్నవాళ్లను పాలించడం దండగ అని తేల్చేశారు. 24 గంటల కరెంటు ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాట మార్చిన నాయకులకు అదే రీతిలో జవాబు చెప్పారు ఇంకా చెప్తూనే ఉన్నా రు. అందుకు నిన్నగాక మొన్న జరిగిన ఉపఎన్నికలే సజీవ సాక్ష్యం.
–అన్విత

👉 *రైతుకు తోడుగా #రైతుబంధు – #రైతుబీమా*
చరిత్రలో ఏ ప్రభుత్వమూ తలచనివి, ఏ నాయకుడి ఊహకు సైతం అందని, తలపెట్టని పథకాలు ‘రైతుబంధు’, ‘రైతు బీమా’. అందుకే, దేశంలో అనేక రాష్ర్టాల ప్రభుత్వాలు, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ ‘రైతుబంధు’ను కాపీ కొట్టింది. రైతన్నకు అద్భుతమైన అండగా నిలచిన ‘రైతుబంధు’ పథకంపైనా ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు. కానీ వాస్తవంగా చిన్న, సన్నకారు రైతులకే కొండంత అండగా నిలబడుతున్నదన్న సత్యం గణాంకాలు చూస్తే తెలుస్తుంది.

‘రైతుబంధు’ పథకం ద్వారా లబ్ధి పొందేవారిలో 41 లక్షల మంది రెండెకరాలలోపున్న రైతులు, 11 లక్షలమంది ఐదు ఎకరాలలోపున్నవారు ఉన్నారు. 5-10 ఎకరాలలోపు భూములున్నవారు 4.44 లక్షలమంది, 10 ఎకరాలకు పైచిలుకు భూములున్నవారు 94 వేలమంది, 25 ఎకరాలకు భూములున్నవారు 6,488 మంది ఉన్నారు. ఈ లెక్కన దాదాపు 95 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ‘రైతుబంధు’ లబ్ధిదారులన్న విషయంలో మరోమాట లేదు. ఇప్పటివరకు ప్రభుత్వం ఈ పథకం కింద రూ.35,676 కోట్ల పెట్టుబడి సహాయం అందించి రైతన్నల మోముల్లో చిరునవ్వులు నింపింది. ఈ రైతు భరోసానే కోటి ఎకరాల తెలంగాణ ఎవుసాన్ని రెండు కోట్లకు తీసుకెళ్లింది. ప్రతి రైతు ఇంటా సిరులు కురిపిస్తున్నది. పెట్టుబడి ఎట్లా అనే సంశయాన్ని బద్దలు చేసింది. పంట పంటకు రైతన్న గుండెల్లో ధైర్యాన్ని నింపింది. ఇక ‘రైతుబీమా’ పథకంలోనూ ఏటికేడు నమోదుదారులు పెరుగుతున్నరు. 2020-21లో 32.73 లక్షలమంది రైతులు నమోదు చేసుకున్నారు. చనిపోయిన 14,254 మంది రైతు కుటుంబాలకు అండగా నిలిచింది రైతుబీమా. ఈ బీమానే రైతన్నను ఎవుసానికి ధీమాగా నిలుస్తుందన్నది సత్యం.