ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత వల్ల రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన సాధారణ యువతకు వ్యాక్సిన్ వేయట్లేదు.
అయితే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మాత్రం వ్యాక్సినేషన్లో ప్రాధాన్యం ఇస్తామని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
విదేశాలకు వెళ్లే వారికి టీకాలు ఇస్తే.. కరోనా బారిన పడకుండా సురక్షితంగా ప్రయాణం చేస్తారని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.