మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఆత్మగౌరవం కోసం కాదని.. తన ఆస్తుల రక్షణ కోసమని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
శుక్రవారం మహబూబాబాద్‌లోని తన నివాసంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణలో ప్రతి సామాన్యుడు పవర్ఫుల్ వ్యక్తేనని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
ఏడేండ్లుగా తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న బీజేపీలో చేరి తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టుపెట్టారని ఘాటుగా విమర్శించారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.