తెలుగు భామ అంజలి.. పెళ్లి గురించి స్పందించింది. ఇటీవల ‘వకీల్ సాబ్’ సినిమాతో అలరించింది అంజలి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లాక్డౌన్లో చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకుంటున్నారు..
మీది ఎప్పుడు అని అడగ్గా.. ప్రస్తుతం పూర్తి ఫోకస్ కెరీర్ మీదే ఉందని, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని అంజలి తేల్చిచెప్పింది.
తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడలోనూ నటిస్తోంది. అంజలి, తమిళ హీరో జై తో ప్రేమలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది.