టాలీవుడ్ నేచూరల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే కోవిడ్ కేసులు తగ్గిన తర్వాత మిగిలిన షూట్ ను పూర్తి చేయనున్నాడు.
కొన్ని రోజుల క్రితం వేణు శ్రీరామ్‌తో నాని ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే వకీల్ సాబ్ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టాడు వేణు శ్రీరామ్.
ఇపుడు వేణు, నాని కాంబోలో సినిమా దాదాపు ఖరారైనట్టేనని, అధికారిక ప్రకటన ఒక్కటే పెండింగ్ లో ఉందని టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరోవైపు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి ప్రాజెక్టు చేస్తున్నాడు నాని.
మరి శ్యామ్ సింగరాయ్ పూర్తయిన తర్వాత నాని ఏ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తాడనేది చూడాలి. నాని నటించిన టక్ జగదీష్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా..కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో వాయిదా పడ్డది.