Home / SLIDER / వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌రేట్ కాంప్లెక్స్‌ను ప‌రిశీలించిన మంత్రి ఎర్ర‌బెల్లి.

వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌రేట్ కాంప్లెక్స్‌ను ప‌రిశీలించిన మంత్రి ఎర్ర‌బెల్లి.

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు వరంగల్ లోని జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” ఈనెల 21న జిల్లాకు సియం కేసిఆర్‌ రానున్నారు. 24 అంతస్థుల మల్టీ సూపర స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన, నూతనంగా నిర్మించిన జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభోత్సవం చేయనున్నరు.ప్ర‌తి జిల్లాకు 57 కోట్ల వ్య‌యంతో అన్ని హంగుల‌తో నూత‌న క‌లెక్ట‌రేట్‌ల స‌ముదాయాల నిర్మాణం ప్రభుత్వం చేపట్టింది.


జిల్లాలో  ప్ర‌జా స‌మ‌స్య‌ల స‌త్వ‌ర ప‌రిష్కారం, అభివృద్ది కోస‌మే చిన్న జిల్లాల ఏర్పాటు. అన్ని కార్యాల‌యాలు ఒకే ద‌గ్గ‌ర ఉండేందుకు స‌మీకృత కార్యాల‌యాల స‌ముదాయాలు. స‌మైఖ్య రాష్ట్రంలో అభివృద్దిలో వెనుక‌బ‌డిన తెలంగాణ రాష్ట్రం. పోరాడి సాధించుకున్న తెలంగాణ‌ను.. బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చేందుకు సియం కేసిఆర్ కృషి. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చిన్న‌చూపుతుందని ఆయన ఆరోపించారు.

నిధులు, హ‌క్కుల కోసం నాడు స‌మైఖ్య పాల‌కుల‌పై పోరాటం.. నేడు కేంద్ర పాల‌కుల‌పై పోరాటం. అన్ని అడ్డంకుల‌ను అధిగ‌మించి, నేడు దేశానికే ఆద‌ర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం. ముఖ్య‌మంత్రి కేసిఆర్ గారి ముందుచూపుతోనే తెలంగాణ‌కు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం. ప్రాజెక్టుల నిర్మాణంతో గ‌ణ‌నీయంగా పెరిగిన ధాన్యం ఉత్ప‌త్తి, ధాన్యం ఉత్ప‌త్తితో దేశానికే అన్న‌పూర్ణ‌గా నిలిచిన తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. కేసిఆర్ గారి పాల‌న‌లో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నారు.
అందరి అభిప్రాయం మేరకే వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటు చేసిందని అన్నారు.


సియం కేసీఆర్ గారు చరిత్రలో నిలిచే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సియం వరంగల్ పర్యటన సంధర్భంగా ప్రజలంతా చప్పట్లతో అభినందించాలని పిలుపునిచ్చారు.వరంగల్ అర్బన్ కలెక్టరేట్ కార్యాలయం ను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారితో పాటు పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,ఎంపి బండా ప్రకాష్, మేయర్ గుండు సుధారాణి,మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు తదితరులు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat