Home / SLIDER / కామారెడ్డి పోలీసు కార్యాలయం ప్రారంభం

కామారెడ్డి పోలీసు కార్యాలయం ప్రారంభం

 సిద్దిపేట పర్యటన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు కామారెడ్డి చేరుకున్నారు. కామారెడ్డి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు.

పోలీసుల గౌరవ వందనం స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్‌ జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.