లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ప్లిక్స్ బాహుబలి సిరీస్ నిర్మాణ పనులను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే చాలా భాగం షూట్ చేసిన తర్వాత షోను రద్దు చేసింది.
మళ్లీ ఇపుడు నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్టు ను రీ లాంఛ్ చేసేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇటీవలే సమంతను సంప్రదించి బిగ్ డీల్ కుదుర్చుకున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ క్రేజీ గాసిప్ ఒకటి చక్కర్లు కొడుతోంది.
బాహులి సిరీస్ లో శివగామి పాత్రలో సమంతను కనిపించనుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సామ్ మరి ఈ రోల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? లేదా? చూడాలి.