ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జమ్మికుంట మండల ఇంచార్జి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు.
బుధవారం జమ్మికుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యేముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో చేయాల్సిన పనులను వేగవంతం చేయాలని, ఇంక పెండింగ్ లో ఉన్న పనులపై అధికారులు నివేదిక ఇవ్వాలన్నారు.
నిధులు మంజూరు చేసి త్వరలోనే పనులు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. గ్రామాల్లో కావాల్సిన కమ్యూనిటీ హాల్స్, మహిళా సమైక్య భవనాలకు సంబంధించిన నివేదికలు కూడా ఇవ్వాలన్నారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాల్లో కొత్తగా రేషన్ కార్డ్ లు 623 మందికి మంజూరు అయ్యాయని తెలిపారు.