Home / SLIDER / రైతు సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ

రైతు సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ

రైతు సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ దూసుకుపోతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. కారేపల్లి మండలం విశ్వనాథపల్లి, తవిసిబోడు గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను మంత్రి పువ్వాడ‌, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్‌ కర్ణన్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌ రూం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దశలవారీగా ఈ పథకం పేదల దరికి చేరుతుందన్నారు.

ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి పథకాలను ప్రవేశపెట్టిందని, వాటి ఫలాలను తెలంగాణ సమాజం అందుకుంటుందని అన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకాలన్నీ అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat