Home / MOVIES / పాన్ ఇండియన్ మూవీలో బన్నీ

పాన్ ఇండియన్ మూవీలో బన్నీ

యూత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ టాప్ దర్శకుడు మురుగదాస్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

కలైపులి ఎస్ థాను ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘పుష్ప’ తర్వాత మురుగదాస్ చిత్రాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయట.