Home / SLIDER / వారెవ్వా.. ఏమి క్యాచ్.!. మీరు వీడియో చూస్తే షేర్ చేస్తారు..?

వారెవ్వా.. ఏమి క్యాచ్.!. మీరు వీడియో చూస్తే షేర్ చేస్తారు..?

భారత మహిళల క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా మొదట వన్డే సిరీస్ ఆడిన టీమిండియా.. శుక్రవారం నార్తాంప్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో తలపడింది. ఈ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్‌కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఓటమి పాలైనా.. భారత యువ క్రికెటర్‌ హర్లీన్‌ డియోల్‌ అందుకున్న ఓ అద్భుత క్యాచ్‌ మాత్రం అభిమానుల మనసులు గెలుచుకుంది.

మహిళల క్రికెట్‌లోనే అది కనీవినీ ఎరగని క్యాచ్‌ అనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఎవ్వరూ ఊహించని క్యాచ్‌. కేవలం పురుషుల క్రికెట్‌లోనే ఇలాంటి అద్భుతమైన క్యాచ్‌లు చూస్తుంటాం. కానీ, డియోల్ అందుకున్న ఈ క్యాచ్ అంతకుమించి అనే చెప్పాలి. మ్యాచ్‌లో శిఖా పాండే వేసిన 18వ ఓవర్‌లోని ఐదో బంతిని ఇంగ్లాండ్ బ్యాట్స్‌వుమెన్ అమీ జోన్స్‌ భారీ షాట్‌తో బౌండరీ దాటించాలని చూసింది.

అయితే, బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డియోల్ ఆ బంతిని అందుకునేందుకు సూపర్ ఉమెన్‌లా మారిపోయింది. అద్భుతమైన డైవ్‌తో వారెవ్వా.. అనిపించే క్యాచ్‌ పట్టింది. తన తల మీదుగా వస్తున్న క్యాచ్‌ను ఎడమవైపు గాల్లోకి డైవ్‌ చేసి అందుకుంది. క్యాచ్ పట్టే క్రమంలో బౌండరీ అవతల పడిపోతానని గ్రహించిన డియోల్ చాకచక్యంగా వెంటనే బంతిని గాల్లోకి విసిరింది. బౌండరీ అవతలికి వెళ్లి మళ్లీ గాల్లోని బంతిని అందుకునేందుకు మైదానంలోకి డైవ్‌ చేసింది. అంతే.. ఒక్క క్షణం మైదానంలోని ప్లేయర్లతో పాటు స్టేడియం గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులు తమ కళ్లను తాము నమ్మలేకపోయారు. డియోల్ క్యాచ్‌తో విస్తుపోయిన అమీ జోన్స్‌ నిరాశగా పెవిలియన్‌ బాట పట్టింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat