Home / MOVIES / అదే నేను నమ్మే సిద్ధాంతం…

అదే నేను నమ్మే సిద్ధాంతం…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్లామర్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని తానెప్పుడూ కోరుకోలేదని అంటోంది లావణ్య త్రిపాఠి. ఒకే ఒరవడికి పరిమితం కాకుండా విభిన్న పాత్రల్లో నటించాలన్నదే తన అభిమతమని చెబుతోంది. జయాపజయాలకు అతీతంగా తెలుగులో చక్కటి అవకాశాల్ని అందుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది లావణ్య త్రిపాఠి.

సినిమాల ఎంపికలో తన ప్రాధామ్యాల గురించి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ‘గ్లామర్‌ అనే మాటకు సరైన నిర్వచనాన్ని చెప్పడం కష్టమే. ఈవిషయంలో అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. కొన్నిసార్లు సినిమాల్లో పాత్రలకు అనుగుణంగా ఆధునిక వస్త్రధారణలో కనిపించాల్సివస్తుంది. అందాల ప్రదర్శన కోసమే అలాంటి దుస్తులు వేసుకున్నామని అనుకోవడం అపోహ అవుతుంది. ధరించే దుస్తులపై గ్లామర్‌ ఆధారపడి ఉండదు.

నా వరకైతే సంప్రదాయ దుస్తుల్లోనే ఎక్కువఅందంగా కనిపిస్తామని నమ్ముతుంటా. సినిమాల పరంగా గ్లామర్‌ హీరోయిన్‌ అనే ఇమేజ్‌ను నేనెప్పుడూ కోరుకోలేదు. కమర్షియల్‌ సినిమాలతో పోలిస్తే నటనకు ఆస్కారమున్న వైవిధ్యమైన పాత్రలు చేయడానికే ప్రాధాన్యతనిస్తా. ఎన్ని సినిమాలు చేశామన్నది కాకుండా ఎలాంటి వాటిలో నటించానన్నదే నాకు ముఖ్యం. అంతిమంగా మంచి సినిమా చేశామనే సంతృప్తి ఉండాలి. సినిమాల ఎంపికలో అదే నేను నమ్మే సిద్ధాంతం’ అని చెప్పింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat