లియామ్ లివింగ్‌స్టోన్ కళ్లు చెదిరే సెంచరీ చేసినా.. ఇంగ్లండ్‌కు విజయం దక్కలేదు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో ఆ జట్టు 31 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌పై నెగ్గింది. 233 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు.. లివింగ్‌స్టోన్ ఆశాకిరణంలా కనిపించాడు.
భారీ షాట్లతో అతను హోరెత్తించాడు. కేవలం 17 బంతుల్లో 50 రన్స్ పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ టీ20 చరిత్రలో ఇది కొత్త రికార్డు. 9 సిక్సర్లతో లివింగ్‌స్టోన్ 43 బంతుల్లో 106 రన్స్ చేసి కీలకదశలో ఔటయ్యాడు.
దీంతో ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 201 రన్స్ చేసి ఆలౌటైంది. అంతకముందు పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ దుమ్మురేపారు. 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 232 రన్స్ చేశారు. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ 85, రిజ్వాన్ 63 రన్స్ చేసి స్కోర్ బోర్డును పరుగెత్తించారు. పాకిస్థాన్‌కు టీ20 క్రికెట్లో ఇదే హయ్యెస్ట్ స్కోరు. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో 3-0 తేడాతో పాక్ ఓడిన విషయం తెలిసిందే.