Home / MOVIES / ‘నారప్ప’ సినిమానుంచి రెండవ పాట విడుదల

‘నారప్ప’ సినిమానుంచి రెండవ పాట విడుదల

‘నారప్ప’ సినిమానుంచి రెండవ పాట విడుదల చేసింది చిత్ర బృందం. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, ప్రియమణి జంటగా నటించిన ఈ సినిమా జులై 20న అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ప్రేక్షకుల ముదుకురాబోతోంది. ఇందులో వెంకీ రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు.

ఇటీవలే మొదటి పాట ‘చలాకి చిన్నమ్మి’ పాటను విడుదల చేయగా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ‘ఓ.. నారప్ప.. నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్ప.. నిను సూడంగానే విప్పారిందోయ్ నారెప్ప’.. అంటూ సాగే మరో పాటను రిలీజ్ చేశారు.

మెలోడియస్‌గా సాగుతున్న ఈ పాటకి మంచి స్పందన వస్తోంది. దీనికి మణిశర్మ సంగీతం అందించారు. ఇక తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘అసురన్‌’కి రీమేక్‌గా రూపొందించారు. సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat