తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రెజీనా నటిస్తున్న తెలుగు వెబ్ సిరీస్ ‘అన్యాస్ ట్యుటోరియల్’. పల్లవి గంగిరెడ్డి దర్శకురాలు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది.
ఈ మూవీ గురించి మాట్లాడిన రెజీనా.. ‘ఓ లేడీ రైటర్ కథ రాయగా, మరో లేడీ డైరెక్టర్ మూవీ తెరకెక్కిస్తున్నారని తెలియగానే ఆసక్తి పెరిగింది. ఇక విచిత్రమైన సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ వినగానే కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా’ అని చెప్పింది. ఈ సిరీస్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.