Home / SLIDER / ఒకే వ‌న్డేలో ఐదుగురు అరంగేట్రం

ఒకే వ‌న్డేలో ఐదుగురు అరంగేట్రం

ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. ఏకంగా ఐదుగురు ప్లేయ‌ర్స్‌కు ఒకే వ‌న్డేలో తొలిసారి అవ‌కాశం ఇచ్చింది టీమిండియా. శ్రీలంక‌తో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో ఆరు మార్పుల‌తో బ‌రిలోకి దిగిన ధావ‌న్ సేన‌.. అందులో ఐదుగురు కొత్త ప్లేయ‌ర్స్‌ను తీసుకుంది. సంజు శాంస‌న్‌తోపాటు నితీష్ రాణా, కే గౌత‌మ్‌, చేత‌న్ స‌కారియా, రాహుల్ చ‌హ‌ర్‌లు త‌మ తొలి వ‌న్డే ఆడుతున్నారు.

ఇలా ఒకే మ్యాచ్‌లో ఐదుగురు ప్లేయ‌ర్స్ ఇండియా త‌ర‌ఫున అరంగేట్రం చేయ‌డం ఇది రెండోసారి మాత్ర‌మే.తొలిసారి 1980లో ఇలా ఒకే వ‌న్డేలో ఐదుగురు కొత్త వాళ్ల‌కు అవ‌కాశ‌మిచ్చిన ఇండియ‌న్ టీమ్‌.. మ‌ళ్లీ 41 ఏళ్ల త‌ర్వాత దానిని రిపీట్ చేసింది.

ఇప్ప‌టికే సిరీస్ గెల‌వ‌డంతో ఈ మ్యాచ్‌లో భారీ మార్పులు చేసింది టీమిండియా. ఇషాన్ కిష‌న్‌, కృనాల్ పాండ్యా, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, దీప‌క్ చ‌హ‌ర్‌, య‌జువేంద్ర చ‌హ‌ల్‌, కుల్‌దీప్ యాద‌వ్‌లకు విశ్రాంతినిచ్చింది.