సౌత్ ఇండస్ట్రీలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తోన్న ‘కేజీఎఫ్’ సీక్వెల్ ‘కేజీఎఫ్ 2’. మొదటి భాగంతో సంచలన విజయాన్ని అందుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్లో తయారవుతున్న ఈ సీక్వెల్ మూవీ మీద భారీ అంచనాలున్నాయి.
ఆ అంచనాలను పెంచుతూ చిత్ర బృందం ఎప్పటికప్పుడు సర్ప్రైజింగ్ అప్డేట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే నేడు (జూలై 29) సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా తాజాగా ‘కేజీఎఫ్ 2’లో అధీరాగా విలన్ పాత్రలో నటిస్తున్న ఆయన న్యూ లుక్ రిలీజ్ చేశారు.
చేతిలో భారీ ఖడ్గం పట్టుకొని ఎంతో పవర్ఫుల్గా కనిపిస్తున్న సంజయ్ లుక్ విపరీతంగా ఆకట్టుకొని ట్రెండ్ అవుతోంది. కాగా ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాలు చేస్తున్నారట. త్వరలో దీనికి సంబంధించిన అఫిషియల్ న్యూస్ రానుందని తెలుస్తోంది.