ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ సోమవారం బంజారాహిల్స్ లో మంత్రుల క్యాంపు కార్యాలయం లో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడెళ్ళ కాలంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు. రాష్ట్రంలో చలనచిత్ర రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళల సహాయ, సహకారాలు అందజేస్తున్నదని ఆయన తెలిపారు