Home / Uncategorized / ఉద్యోగం కావాలని ట్వీట్ చేసిన జాతి రత్నాలు “హీరో”

ఉద్యోగం కావాలని ట్వీట్ చేసిన జాతి రత్నాలు “హీరో”

స్క్రీన్ రైటర్‌గా కెరియర్ స్టార్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి.. చిన్న చిన్న పాత్రల చేస్తూ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో హీరోగా మారాడు. ఇక రీసెంట్‌గా జాతి ర‌త్నాలు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరించాడు. ప్రేక్ష‌కులు, సినీ సెల‌బ్రిటీలు,రాజ‌కీయ నాయ‌కులు కూడా ఈ సినిమాకి ఫిదా అయ్యారు. అయితే న‌వీన్ న‌టుడిగానే కాకుండా మాన‌వ‌తా వాదిగాను నిరూపించుకుంటున్నాడు.

క‌రోనా కార‌ణంగా ఎంద‌రో ఉద్యోగాలు కోల్పోయారు. పొట్ట‌కూటి కోసం బండ్ల‌పై కూర‌గాయ‌లు అమ్ముకోవ‌డం వంటివి చేస్తున్నారు. కొంద‌రైతే ప‌రువు కోసం ఇంటిప‌ట్టునే కూర్చొని జాబ్ కోసం నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే స‌మీర్ అనే ఉద్యోగి క‌రోనా కార‌ణంగా ఉద్యోగం కోల్పోయాడ‌ని, ఎవ‌రైన ఆయ‌న‌కు సాయం చేయండ‌ని చరణ్, సౌమ్య అనే ఇద్దరు నెటిజన్లు వేడుకున్నారు. ఈ ట్వీట్ నవీన్ పోలిశెట్టి దృష్టికి రావడంతో సదరు వ్యక్తి వివరాలను పేర్కొంటూ హైదరాబాద్‌లో ఎక్కడైనా ఉద్యోగం ఉంటే చెప్పండి, అతనికి సాయం చేయండి అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెడుతూ ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు.

న‌వీన్ పోలిశెట్టి ట్వీట్‌కి వెంట‌నే స్పందించిన ఎవోక్ వేగాన్ స్టోర్ అండ్ కేఫ్ సమీర్ అనే యువకుడికి స్టోర్ మేనేజర్‌గా ఉద్యోగం కల్పించింది. స‌మీర్ త‌న ఆఫ‌ర్ లెట‌ర్‌ని షేర్ చేస్తూ న‌వీన్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు. అయితే ఇదే ఆఫ‌ర్ లెట‌ర్‌ని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన న‌వీన్ .. సంతోషం వ్య‌క్తం చేస్తూ సంస్థ కి వచ్చి సిబ్బందిని కలుస్తానని అన్నాడు. ఈ కష్ట సమయంలో ఉద్యోగం కోల్పోయిన వారికి తమ వంతు సహాయం చేయాలని అందరినీ నవీన్ కోరాడు. న‌వీన్ చేసిన ప‌నిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్న నెటిజ‌న్స్ నిజ‌మైన జాతిర‌త్నం అని కామెంట్ చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat