Home / SLIDER / జయశంకర్ సారు ఆశ‌య‌సాధ‌న‌కు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు

జయశంకర్ సారు ఆశ‌య‌సాధ‌న‌కు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు

ప్రత్యేక రాష్ట్ర సాధ‌న‌ కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన నిరంతర కృషిని తెలంగాణ సమాజం ఎప్పటికీ మరచిపోదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న విగ్రహానికి పూల‌మాల వేసి మంత్రి నివాళుల‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి పాల‌న‌లో తెలంగాణ‌కు జ‌రిగిన అన్యాయాల‌ను అనేక వేదికల ద్వారా త‌న గ‌ళాన్ని వినిపించార‌ని, తెలంగాణ భావజాల వ్యాప్తికి జ‌య‌శంక‌ర్ సార్ జీవితాంతం కృషి చేశార‌ని ఆయ‌న సేవ‌ల‌ను స్మరించుకున్నారు. ప్రత్యే తెలంగాణ‌ రాష్ట్ర సాధనకు ఆయ‌న‌ ఆయువుపట్టుగా ఉన్నారు. తెలంగాణ ప్రజల హృదయాలలో సార్ ఎప్పటికి నిలిచి ఉంటార‌ని పేర్కొన్నారు.

ఆయన అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ..రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూ…ఆయ‌న ఆశ‌య‌సాధ‌న‌కు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నార‌ని తెలిపారు. జయశంకర్ సార్ పై ఉన్న ఎన‌లేని గౌర‌వంతో వ్యవసాయ యూనివ‌ర్సీటికీ ఆయ‌న పేరు పెట్టారని చెప్పారు. కార్యక్రమంలో క‌లెక్టర్‌ ముషార‌ఫ్ అలీ ఫారూఖీ, మున్సిప‌ల్ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మన్‌ ఎర్రబోతు రాజేంద‌ర్, త‌దత‌రులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat