Home / NATIONAL / దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,204 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 147 రోజుల తర్వాత రోజువారీ కేసులు భారీగా తగ్గాయని పేర్కొంది.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 3,88,508 ఉన్నాయని.. 139 రోజుల తర్వాత కనిష్ఠానికి చేరుకున్నాయని తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.21శాతం ఉన్నాయని చెప్పింది. రికవరీ రేటు 97.45శాతానికి పెరిగిందని పేర్కొంది.

గడిచిన 24 గంటల్లో 41,511 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు.తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,19,98,158కు పెరిగింది. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 3,11,80,968 మంది బాధితులు కోలుకున్నారు. మరో 373 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,28,682కు పెరిగింది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat