Home / SLIDER / వేములవాడలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు

వేములవాడలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు

తెలంగాణ రాష్ట్రంలోని  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మంగళవారం మంత్రి కేటీఆర్‌ను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు.

నియోజకవర్గంలో చేపట్టే పనుల వివరాలను మంత్రికి అందించారు. అనంతరం మంత్రి కేటీఆర్ వేములవాడ అభివృద్ధిపై సమీక్షించి, అభివృద్ధికి పరిపాలన అనుమతులు జారీ చేశారు.

రూ.20కోట్ల విలువైన పనులు ప్రారంభించేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రమేశ్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు.