Home / SLIDER / ఆగస్టు 15 నుండి రూ. 50 వేల వరకు పంట రుణాల మాఫీ

ఆగస్టు 15 నుండి రూ. 50 వేల వరకు పంట రుణాల మాఫీ

రైతును రాజును చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పలు సందర్భాలలో సీఎం కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. చెప్పిన విధంగానే రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలను మాఫీ చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ఏడాది కొంత మొత్తాన్ని మాఫీ చేసిన కేసీఆర్ సర్కార్ ఈసారి మరికొంత మాఫీని చేయాలని నిర్ణయించింది. ఇక మరో ఏడాది పాటు రైతుబీమాను అమలు చేసేందుకు సైతం ప్ర భుత్వం నిర్ణయించింది. ఈ రెండు కార్యక్రమా లను వచ్చే మూడు రోజులలో అమలు చేస్తున్నారు.

సమైఖ్య రాష్ట్రంలో సాగునీరు లభించక రైతులు అల్లాడిపోయారు. బోరుబావుల మీద ఆధారపడిన రైతులకు కష్టాలు తప్పలేదు. ఎప్పుడు విద్యుత్ వస్తోంది.. ఎప్పుడో పోతుందో తెలియని పరిస్థితి ఉండింది. వర్షాధార పంటలను సాగు చేసిన రైతుల పరిస్థితి కూడా దయనీయంగా ఉండింది. తెలంగాణ రాష్ట్ర సాధన తరువాత రైతుల కష్టాలను దూరం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా భారీ సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడంపై దృష్టిసారించారు. గ్రామాలలో శిథిలమైన చెరువులను మిషన్ కాకతీయ పథకం కింద పునరుద్దరిం చారు. పుష్కలంగా సాగు నీరు.. భూగర్భజలాలు అందు బాటులోకి రావడంతో రైతులు పండగ చేసు కుంటున్నారు.

ఈ కార్యక్రమాలతో పాటు టిఆర్ఎస్ భుత్వం ఎవరూ ఊహించని పథకాలను రైతులకు అమలు చేస్తోంది. పంటల సాగు సమయంలో పెట్టుబడి కి రైతులు ఇబ్బంది ఎదుర్కొనకుండా ఉండేందుకు రైతుబంధు పథకంను అమలు చేస్తోంది. రైతులు ఏ కారణంతో అయినా చనిపోతే కుటుంబ సభ్యులకు పరిహారం అందించేందుకు రైతుబీమాను అమలు చేస్తున్నారు. ఈ రెండు పథకాలు రైతులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. రైతుబీమా పాలసీ గడువు ఈ నెల 14తో ముగుస్తోంది. రైతుల పేరిట జారీ చేసిన పాలసీలను మరో ఏడాది పునరుద్ధ రించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భారత బీమా సంస్థతో ఉన్న ఒప్పందంను మరో ఏడాదిపాటు పొడ గించింది. ఇక రైతుల పంట రుణాలను మాఫీ చేయడంపై కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ఏడాది రూ.25 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేయగా ఈసారి రూ.50 వేల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 15 నుంచి రైతుల బ్యంకు ఖాతాలలో రుణమాఫీ సొమ్మును జతచేస్తా మని.. వాటిని బ్యాంకులు తీసుకునేలా ఏర్పాట్లు చేసింది.

రైతుబీమా పథకం కింద జిల్లాలో దాదాపు 2.40 లక్షల మందికి పాలసీలను జారీ చేశారు. గత ఏడాది జిల్లాలో దాదా పు 900 మంది వివిధ కారణాలతో చనిపోయారు. కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారం చెల్లించారు. మరోవైపు రూ.50 వేల వరకు ఉన్నపంటరుణాల మాఫీని కూడా ఈ నెల 15 నుంచి అమలు చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 50 వేల మంది రైతులకు ప్రయోజనం లభిస్తోంది. జిల్లాలో మొత్తం 97,500 మంది బ్యాంకుల నుంచి పంట రుణాలను తీసుకు న్నారు. గత ఏడాది రూ.25 వేల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయడంతో జిల్లాలో దాదాపు 10,800 మందికి ప్రయోజనం చేకూరింది. అటు రైతుబీమా పథకం పొడగి అపు.. ఇటు రైతు పంట రుణమాఫీ నిర్ణయంను ఒకే సారి తీసుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat