Home / SLIDER / త్వరలోనే ‘హెల్త్‌ ప్రొఫైల్‌’ ప్రాజెక్టు ప్రారంభం

త్వరలోనే ‘హెల్త్‌ ప్రొఫైల్‌’ ప్రాజెక్టు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారాన్ని సేకరించే ‘హెల్త్‌ ప్రొఫైల్‌’ ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దీనిని రూపొందించేముందు ప్రయోగాత్మకంగా చిన్న జిల్లాలైన ములుగు, రాజన్న సిరిసిల్లను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంచుకున్నామని తెలిపారు.

ప్రాజెక్టు పురోగతిపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి కేటీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రెండు జిల్లాల్లోని వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటి వద్దే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను సేకరిస్తారని తెలిపారు. బీపీ, మధుమేహం, ప్రాథమిక రక్త, మూత్ర పరీక్షలను అకడికకడే నిర్వహిస్తారని అన్నారు. ఎవరికైనా అదనపు పరీక్షలు అవసరమని భావిస్తే స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ సెంటర్లకు పంపి, పరీక్షలు చేయిస్తారని వివరించారు.

ఇందుకు ప్రాథమిక కేంద్రాల్లో అవసరమైన పరికరాలు, సిబ్బందిని సమకూర్చుతామని చెప్పారు. ఈ ప్రాజెక్టులో ఐటీ, వైద్యశాఖ సమన్వయంతో భాగస్వాములు అవుతాయని అన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఐటీశాఖ ఆధ్వర్యంలో అనేక ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌, మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌పై అందిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. టెక్నాలజీ సహకారంతో ప్రజా సమస్యలను పరిషరించేందుకు, అత్యంత సులభంగా ప్రభుత్వ సేవలను అందించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందువరుసలో ఉంటుందని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat