Home / SLIDER / రేవంత్‌ రెడ్డి ఒక డ్రామా ఆర్టిస్టు

రేవంత్‌ రెడ్డి ఒక డ్రామా ఆర్టిస్టు

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఒక డ్రామా ఆర్టిస్టులా మారాడని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. మాటతీరు మార్చుకొమ్మని చెప్పినా మారడం లేదని చెప్పారు. రేవంత్‌ చంద్రబాబు పెంపుడు కుక్కఅని మండిపడ్డారు.

అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. వందమంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తొక్కితే రేవంత్‌ 30 అడుగుల లోతుకు పోతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ కాలిగోటికి సరిపోడని, ముఖ్యమంత్రిపై మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ తెస్తేనే రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని విమర్‌శించారు.

కాంగ్రెస్‌ అంటేనే జైలు పార్టీ, బెయిల్‌ పార్టీ అని ఎద్దేవా చేశారు. రేవంత్‌ తీరుపై ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్‌ గాంధీకి లేఖ రాశనని చెప్పారు. ఆయనది ఐరన్‌ లెగ్‌ అని, ఏ పార్టీలో చేరితే అది నాశనమవుతుందని పేర్కొన్నారు.

రేవంత్‌ రెడ్డి ఎక్కడైనా మీటింగ్‌ పెట్టుకోవచ్చని, అయితే దళితబంధు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి పథకాలు వద్దని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అన్నీ చేసుంటే ఇప్పుడు మా అవసరం ఏమొచ్చేదన్నారు. రేవంత్‌ రెడ్డి.. చంద్రబాబు పెంపుడు కుక్క అని, మల్కాజిగిరిలో ఆయనకు చంద్రబాబు ఎంత డబ్బు పంపించిండో తనకు తెలుసునని వెల్లడించారు. గిరిజన ఎమ్మెల్యే సీతక్కతో చంద్రబాబు కాళ్లు మొక్కించాడని విమర్శించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat