Home / SLIDER / తెలంగాణ బీజేపీలో వర్గపోరు

తెలంగాణ బీజేపీలో వర్గపోరు

పేరుగొప్ప జాతీయ పార్టీ బీజేపీ.. రాష్ట్రంలో ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటల్లో చిక్కుకొన్నది. ఆధిపత్యపోరు రోజు రోజుకూ ముదిరి పాకాన పడటంతో ముగ్గురు నేతలు.. ఆరు గ్రూపులు అన్నట్టుగా మారింది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మాట అటుంచితే కనీసం పార్టీలో ఏ గ్రూపునకు మరే గ్రూపు ప్రత్యామ్నాయం అవుతుందో తేల్చుకోలేని పరిస్థితి నెలకొన్నది.

ఒకవైపు కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ల నేతృత్వంలోని గ్రూపులే ఎత్తుకుపై ఎత్తులతో రసకాందయంలో రాజకీయాలు నడుపుతున్న కమలం పార్టీలో తాజాగా సందట్లో సడేమియా అన్నట్టు బిజెపీ జాతీయ ఉపాధ్యాక్షురాలైన డీకే అరుణ నేతృత్వంలో మరో కొత్త ్రగ్రూపు కూడా వేళ్లునూకుంటున్నట్టు ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు వాపోయారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తాజాగా పుట్టికొచ్చిన డీకే అరుణ గ్రూపుతో సహా అన్ని గ్రూపులకు హస్తినలోని అధిష్ఠానంలో గాడ్‌ ఫాదర్లు ఉండటం మరీ చోద్యమని సదరు సీనియర్‌ నేత తెలిపారు. బీజేపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు ఒకరు జాతీయ స్థాయిలో నామినేటెడ్‌ పోస్టు లేక గవర్నర్‌గిరీ కోసం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పంచన చేరి.. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి చెక్‌ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీ వర్గాల్లో బాహాటంగానే చర్చ జరుగుతున్నది. మరోవైపు రాష్ట్రంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గ్రూపు, ఆధిపత్యానికి చెక్‌ పెట్టడానికి పార్టీ జాతీయ కమిటీలో కీలక నేత ఒకరు బండి సంజయ్‌కి గాడ్‌ ఫాదర్‌గా అండదండలు అందిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.

 

రాష్ట్ర బీజేపీలో రెండు గ్రూపుల అంతర్గత కుమ్ములాటలతో విసిగిపోయిన మరి కొందరు నేతలు, వీటికి అతీతంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలి నేతృత్వంలో తటస్థ గ్రూపుగా ఏర్పడినట్టు సమాచారం. పార్టీ జాతీయ కమిటీలో గతంలో కీలక పదవులు నిర్వహించిన ఇద్దరు ముఖ్య నేతలతోపాటు ఒక మాజీ ఎంపీ కూడా కొత్త గ్రూపుతో జత కట్టి పార్టీకి విధేయుల గ్రూపుగా నిలదొక్కుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఈ వర్గాల సమాచారం. ఈ గ్రూప్‌ తగాదాలతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జరపతలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముచ్చటగా మూడోసారి కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నెల 28 నుంచి ఈ యాత్ర జరుగుతుందన్న గ్యారంటీ లేదని ఆ పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామంటే తామేనని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ అంతర్గత మూఠా తగాదాలతో ఒక అడుగు ముందుకెస్తే మూడు అడుగులు వెనక్కి వేసే పరిస్థితి ఎదుర్కొంటున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat