Home / MOVIES / మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ “‘కిన్నెరసాని'” టీజర్‌

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ “‘కిన్నెరసాని'” టీజర్‌

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘విజేత’. ఈ సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. ఇదే క్రమంలో ఇప్పుడు ‘కిన్నెరసాని’ అనే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

‘అశ్వద్ధామ’ ఫేమ్ రమణతేజ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీకి ‘అతి సర్వత్ర వర్జయత్’ అనేది ఉప శీర్షిక. సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ – శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.

‘ఈ ప్రపంచంలో ప్రతీ దానికి ఓ లిమిట్ ఉండాలి.. అది ద్వేషానికైనా.. చివరకు ప్రేమకైనా’.. అనే డైలాగ్ ఆకట్టుకుంది. దీనికి మహతి సాగర్ అందించిన నేపథ్య సంగీతం బాగా కుదిరింది. వేద అనే పాత్రలో కళ్యాణ్ దేవ్ కనిపించనున్నాడు. కాగా త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇక కళ్యాణ్ దేవ్ ఈ సినిమాతో పాటే ‘సూపర్ మచ్చి’ అనే మరో సినిమానూ చేస్తున్నాడు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat