Home / CRIME / డ్రగ్స్ కేసులో నటుడు అరెస్ట్

డ్రగ్స్ కేసులో నటుడు అరెస్ట్

డ్రగ్స్ కేసులో నటుడు అర్మాన్ కోహ్లీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఆయన నివాసంపై ముందస్తు సమాచారంతో శనివారం ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయన ఇంట్లో డ్రగ్స్ లభించినట్లు వారు పేర్కొన్నారు. కాగా, అర్మాన్‌ను ఏసీబీ కార్యాలయంలో విచారించనున్నట్లు వారు పేర్కొన్నారు.

అర్మాన్ కోహ్లీ ఇంటికి ఎన్‌సీబీ అధికారులు వచ్చి సోదాలు నిర్వహించిన, ఆయనను అరెస్ట్ చేసిన ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కొద్ది రోజుల క్రితం బాలీవుడ్‌ను డ్రగ్స్ కేసు కుదిపివేసింది. హీరో సుశాంత్ సింగ్ మరణానికి డ్రగ్స్ కారణమని ఓ ఆరోపణ నేపథ్యంలో రేగిన వివాదం.. చిలికి చిలికి బాలీవుడ్‌ను డ్రగ్స్ వివాదంలో పడేసింది. దీపిక పడుకొనె సహా అనేక మంది ప్రముఖ తారల పేర్లు ఈ కుంభకోణంలో ఉన్నట్లు వినిపించాయి.